
హన్వాడ, వెలుగు: బాలల సంరక్షణ పై నిర్లక్ష్యం వద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హన్వాడ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకొని, చదువుకోవాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు.
ఏదైనా సమస్య వస్తే 1098 కు ఫోన్ చేయాలని, అధికారులు పరిష్కారం చూపుతారని తెలిపారు. తహసీల్దార్ కిష్ట్యా నాయక్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీబీ రోగులకు నిక్షయ్ పోషణ్ కిట్లను పంపిణీ చేశారు. డాక్టర్ చతుర్వేది, సిబ్బంది ఉన్నారు.
వనపర్తి గిరిజన బాలికల పాఠశాలలో..
వనపర్తి, వెలుగు: వనపర్తి గిరిజన బాలికల పాఠశాలలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ర్టిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.రజని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండటం శోచనీయమన్నారు. విద్యాహక్కు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బాలనాగయ్య, డిఫెన్స్ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉత్తరయ్య, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.